- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి రాబోతున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’.. బిగ్ సర్‌ప్రైజ్ కోసం సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్
ఇటీవల చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’(Raju weds Rambai) ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.

దిశ, సినిమా: ఇటీవల చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’(Raju weds Rambai) ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి (Sailu Kampati)తెరకెక్కించిన ఈ విలేజ్ ప్రేమ కథా చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో అఖిల్ రాజ్, తేజస్విని రావు (Tejaswini Rao)హీరోహీరోయిన్లుగా నటించగా.. సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ పాత్రలో కనిపించి నటనతో అదరగొట్టేశాడు. అయితే నవంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకులను కన్నీరు పెట్టించింది.
ఇలా ప్రేక్షకుల మనసులను కదిలించిన హార్ట్ టచింగ్ మూవీ ‘రాజ్ వెడ్స్ రాంబాయి’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. తాజాగా, ఈ విషయంపై ప్రముఖ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ సినిమా హక్కుల్ని ప్రముఖ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకోగా.. డిసెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టారు.‘థియేటర్స్ లో మోత మోగించాం.. ఇప్పుడు మీ ఇంట్లో కూడా మోత మోగించడానికి కూడా వస్తున్నాం విత్ డాల్బీ అట్మాస్ సౌండ్ అండ్ విజన్ తో’ అని క్యాప్షన్ జత చేశారు.
అంతేకాకుండా మరో సర్‌ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నామని తెలిపారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ ఎక్స్‌టెండెడ్ కట్‌ను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా రన్‌టైన్ 2గంటల15 నిమిషాలు కాగా.. ఓటీటీలో మాత్రం మరికొన్ని అదనపు సన్నివేశాలను జోడించి స్ట్రీమింగ్‌కు తీసుకురాబోతున్నారని సమాచారం. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Read More..






