Rajini Kanth ‘Jailer’ నెంబర్ వన్ మూవీగా రికార్డు.. First Day Collections ఎంతంటే?

by Disha Web Desk 6 |
Rajini Kanth ‘Jailer’ నెంబర్ వన్ మూవీగా రికార్డు.. First Day Collections ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ విభిన్నమైన చిత్రాలు, ప్రత్యేకమైన స్టైల్స్‌తో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగానే సినీ రంగంలో తనదైన రీతిలో సందడి చేస్తున్నారు. కాగా, రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘జైలర్’. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రత్యేక పాత్రలో నటించగా.. శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, సునీల్, జాకీ ష్రాఫ్, యోగి బాబు, మెహన్ లాల్ కీలక పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఆగస్టు 10న వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

‘జైలర్’ మూవీ మొదటి షోతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్‌లోనూ బాక్సాఫీసును బద్దలు కొడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో దీనికి రూ. 9 కోట్లు గ్రాస్, కేరళలో రూ. 5 కోట్లు గ్రాస్, కర్ణాటకలో రూ. 10 కోట్లు గ్రాస్, ఇలా ఇండియా మొత్తంలో ఈ సినిమా రూ. 49 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో రూ. 52 కోట్లు గ్రాస్ లభించింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 80 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తమిళంలో టాప్ మూవీగా రికార్డును సాధించింది జైలర్.

ఇవి కూడా చదవండి : OTT లోకి ‘Adipurush’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?


Next Story