రజనీకాంత్ ‘జైలర్’ ఆడియో లాంచ్ ఈవెంట్..!

by Disha Web Desk 7 |
రజనీకాంత్ ‘జైలర్’ ఆడియో లాంచ్ ఈవెంట్..!
X

దిశ, సినిమా: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొంతకాలంగా వరుస అపజయాలు అందుకుంటున్నారు. దీంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ అందుకోవాలని ‘జైలర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌, మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు.

ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 10న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్‌ను మేకర్స్ జూలై 28న చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేయగా.. ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

Next Story

Most Viewed