మరో వివాదంలో చిక్కుకున్న రాజేంద్ర ప్రసాద్.. షాకింగ్ కామెంట్స్ వైరల్

by Mallepaka Hamsa |

ఇటీవల ‘కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు’ అందుకున్న రాజేంద్ర ప్రసాద్, ఆ వేదికపై దివంగత నటుడు కాంతారావు గొప్పదనాన్ని వివరించే ప్రయత్నం చేశారు.

మరో వివాదంలో చిక్కుకున్న రాజేంద్ర ప్రసాద్.. షాకింగ్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చుట్టూ ఇప్పుడు వివాదాలు ముసురుకుంటున్నాయి. ఇటీవల కాలంలో తన ప్రవర్తనతో, వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా.. మళ్లీ మళ్లీ అదే పని చేస్తున్నారు. తాజాగా, తమిళనాడు ఆరాధ్య దైవం, దివంగత ముఖ్యమంత్రి, నటుడు ఎంజీఆర్ (MGR) పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తమిళ తంబీలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇటీవల ‘కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు’ అందుకున్న రాజేంద్ర ప్రసాద్, ఆ వేదికపై దివంగత నటుడు కాంతారావు గొప్పదనాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. "జానపద చిత్రాలతో దూసుకెళ్తున్న కాంతారావుని చూసి అప్పట్లో ఎంజీఆర్ భయపడిపోయాడు.

కాంతారావు పేరు చెబితే అమ్మ బాబోయ్ అనేవాడు. ఆయన జానపదాలు చూసి.. వాడెవడురా బాబోయ్ ఇండియన్ సినిమాలను లేపుకెళ్లిపోతున్నాడు అని భయంతో ఉ** పోసుకునేవాడు" అంటూ పదే పదే వివాదాస్పద పదజాలాన్ని వాడారు. ఒక గొప్ప నటుడిని పొగిడే క్రమంలో, మరో లెజెండరీ నటుడిని కించపరచడంపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తమిళ ప్రజలు దేవుడిలా భావించే ఎంజీఆర్‌ను ఉద్దేశించి వాడు, వీడు అనడమే కాకుండా, అసభ్యకరమైన పదాలు వాడటంతో సోషల్ మీడియాలో రాజేంద్ర ప్రసాద్‌పై ట్రోలింగ్ మొదలైంది. ఒక సీనియర్ నటుడై ఉండి పద్ధతి లేకుండా మాట్లాడటం ఏంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఫోటో అడిగిన అబ్బాయిని తోసేసిన ఘటనలో విమర్శలు ఎదుర్కొన్న ఆయన, ఇప్పుడు ఈ ఎంజీఆర్ ఇష్యూతో మరింత చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Next Story