ఎమ్మెల్యేగా రాజేంద్రప్రసాద్.. 'శాసనసభ'లో నిజాయితీగా ఉంటానని

by Disha Web Desk 7 |
ఎమ్మెల్యేగా రాజేంద్రప్రసాద్.. శాసనసభలో నిజాయితీగా ఉంటానని
X

దిశ, సినిమా: ఇంద్రసేన, ఐశ్వర్యా రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'శాసనసభ'. పాన్ ఇండియా లెవల్లో రాబోతున్న సినిమాలో సీనియర్ నటుడు డా. రాజేంద్రప్రసాద్ ఎమ్మెల్యే నారాయణస్వామిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఇండిపెండేన్స్ డే సందర్భంగా విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ కార్యక్రమంలో చిత్రనిర్మాతలు తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు మాట్లాడుతూ.. విలువలు, నిజాయితీ కలిగిన నాయకుడుగా రాజేంద్రప్రసాద్ అద్భుతంగా నటించాడని, ఇప్పటి వరకు ఆయన కెరీర్‌లో పోషించిన విభిన్నమైన పాత్రల్లో ఇదే హైలైట్‌ అవుతుందన్నారు. ఇక వేణు మడికంటి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ రవిబసుర్ సంగీతం అందిస్తుండగా సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు 'ఆస్కార్ అవార్డ్' చాన్స్.!



Next Story