- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి సమస్యతో బాధపడుతున్న రాజశేఖర్.. షాకింగ్ విషయాలు చెప్పడంతో ఆందోళనలో ఫ్యాన్స్
ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ (Rajasekhar)అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ (Rajasekhar)అందరికీ సుపరిచితమే. ఆయన ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకోవడంతో పాటు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ సినిమాలతో ఎంతో ఆదరణ పొందారు. గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రాజశేఖర్ మళ్లీ శర్వానంద్ (Sharwanand)హీరోగా నటిస్తున్న ‘బైకర్’ (Biker)తో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో మా ఫొటోగ్రాఫర్ రాకపోవంతో వేరే అతన్ని మాట్లాడుకున్నాం. మీరెన్ని సినిమాలు చేశారని అడిగితే.. కొన్ని పేర్లు చెప్పాను. అప్పుడు అతను మీరు చాలా లక్కీ అన్నాడు. ఎందుకంటే..మీకు పని ఉంది. నేను పెద్దగా నాకేం అనిపించలేదు. కానీ నిజంగా పని లేకుండా ఇంట్లో నడవలేని పరిస్థితి జైలు శిక్షలా అనిపించింది.
హీరోగా దాదాపు వంద సినిమాలు చేశాను. హీరోగా మాత్రమే కాకుండా మంచి పాత్రలొస్తే చేద్దామని అనుకున్నా... కథలు నచ్చక చాలా చిత్రాలు చేయలేదు. అలా నేను డిసప్పాయింట్ గా నేనున్న టైమ్ లో 'బైకర్' కథ నా దగ్గరకొచ్చింది. కానీ స్టోరీ విన్నాక నేను హీరోగా నటిస్తానని చెప్పాలనిపించింది. ఇటీవల దర్శకుడు నా దగ్గరకు వచ్చి ఈవెంట్ నిర్వహిస్తున్నాం మాట్లాడాలని చెప్పడంతో నేను అంగీకరించలేదు. ఎందుకంటే.. నాకు ఎన్నో ఏళ్ల నుంచి ‘ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్’ అనే సమస్యతో బాధపడుతున్నాను. నా కడుపు చెడిపోయింది.. అంతా నాశనం అవుతుందనుకుని వచ్చా’’ అని అన్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో.. వాటిని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.






