- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SSMB 29: జక్కన్న షాకింగ్ నిర్ణయం.. షాక్ లో టాలీవుడ్ ?
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి (Raja Mouli) కాంబినేషన్ లో భారీ ప్రాజెక్టు వస్త

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి (Raja Mouli) కాంబినేషన్ లో భారీ ప్రాజెక్టు వస్తున్న సంగతి తెలిసిందే. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమాను కూడా ప్రారంభించారు రాజమౌళి. ప్రస్తుతం... హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు చెబుతున్నారు. ప్రత్యేకంగా సెట్ వేసి మరి... షూటింగ్ నిర్వహిస్తున్నారట రాజమౌళి.
అతి త్వరలోనే కెనడాలో కూడా ఈ సినిమా షూటింగ్ జరగబోతున్నట్లు చెబుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని రాజమౌళి పై వార్త చెక్కర్లు కొడుతోంది. మహేష్ బాబుతో చేస్తున్న సినిమాలో.. కొత్త వాళ్లను మాత్రమే తీసుకునేందుకు రాజమౌళి నిర్ణయం తీసుకున్నారట. అందుకే గతంలో తనతో పని చేసిన వాళ్లందరినీ తొలగించినట్లు చెబుతున్నారు.
తాజాగా ఇదే విషయాన్ని సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ (KK Senthil Kumar) కూడా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబుతో చేస్తున్న సినిమా నేపథ్యంలో కొత్త వాళ్లకు మాత్రమే రాజమౌళి అవకాశాలు ఇస్తున్నట్లు గుర్తు చేశారట. అందుకే తాను ఈ ప్రాజెక్టుకు వర్క్ చేయడం లేదని ఆయన పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే.






