ఆస్కార్ వేదికపై కౌగిలింతలతో ఉక్కిరిబిక్కిరైన రమా రాజమౌళి.. ఇంతకూ చేసిందెవరంటే..!

by Dishafeatures2 |
ఆస్కార్ వేదికపై కౌగిలింతలతో ఉక్కిరిబిక్కిరైన రమా రాజమౌళి.. ఇంతకూ చేసిందెవరంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఇవాళ అమెరికాలో జరిగిన 95వ ఆస్కార్ అవార్డు వేడుకల్లో నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నాటు నాటు సాంగ్ కు అకాడమీ వాళ్లు అవార్డును ప్రకటించగానే ఆర్ఆర్ఆర్ మూవీ డైరెక్టర్ రాజమౌళి ఆనందంతో గంతులేశారు. పట్టరాని సంతోషంతో పక్కనే ఉన్న తన భార్య రమా రాజమౌళిని గట్టిగా హత్తుకున్నారు. ఈ క్రమంలో ఆయన కళ్లల్లో ఆనంద భాష్పాలు సుడులు తిరిగాయి.

బాహుబలి, ఛత్రపతి, మగధీర, సింహాద్రి వంటి ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలు తీసిన ఈ దిగ్గజ డైరెక్టర్.. అవార్డ్ వచ్చిన వేళ ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా మారిపోయి యాహూ అంటూ తన విజయాన్ని భార్య, ఇతర కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. మొత్తానికి తన క్రియేటివిటీతో తనతో పాటు దేశం మొత్తానికి ఆనందాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చిన రాజమౌళిని ‘జయహో జక్కన్న’ అంటూ సోషల్ మీడియాలో తెగపొగడుతున్నారు.



Next Story

Most Viewed