వీడెక్కడ దొరికాడు అంటూ NTRపై రాజమౌళి సెన్సెషనల్ కామెంట్స్

by Disha Web Desk 9 |
వీడెక్కడ దొరికాడు అంటూ NTRపై రాజమౌళి సెన్సెషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ దర్శకుడు రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్‌‌‌కు ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ మీద అభిమానాన్ని జక్కన్న ‘‘ఆర్ఆర్ఆర్‘‘ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బయట పెట్టారు. వీరిద్దరు కలిసి ఇప్పటివరకు కలిసి చేసిన నాలుగు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. తాజాగా జక్కన్న ఓ ఈవెంట్‌లో ‘‘ఎన్టీఆర్‌తో చేసిన ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్1 సినిమా తీస్తున్నందుకు బాధపడ్డాను. మొదటి సినిమాకే ఇలాంటి వాడు దొరికాడని ఎన్టీఆర్‌ను చూశాక చాలా డిసపాయింట్ అయ్యాను. అప్పటికి ఈయనకు మూతి మీద మీసం కూడా రాలేదు. కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన పది రోజులకే ఈ హీరోలోని టాలెంట్‌ను చూసి షాక్ అయ్యాను.’’ అంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కెరీర్‌లో సింహాద్రిని ఆయన గత చిత్రాలు మ్యాచ్ చెయ్యలేకపోయాయని అన్నారు. తాను ఎన్టీఆర్‌తో ‘యమదొంగ’ సినిమా తీయగా మంచి విజయాన్ని సాధించిందని జక్కన్న గుర్తు చేసుకున్నారు.

Read More: 20 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన స్నేహ..



Next Story

Most Viewed