అల్లు అర్జున్ తో జ‌క్క‌న్న సినిమా..థియేట‌ర్లు బ్లాస్ట్ కావాల్సిందే !

by velandi.Saikiran |

పుష్ప‌తో దుమ్ములేపిన అల్లు అర్జున్ తో సినిమా చేయాల‌ని రాజ‌మౌళి అనుకుంటున్నార‌ట‌. ఈ మేర‌కు క‌థ సిద్ధం చేయాల‌ని

అల్లు అర్జున్ తో జ‌క్క‌న్న సినిమా..థియేట‌ర్లు బ్లాస్ట్ కావాల్సిందే !
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో తిరుగులేని ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే...అంద‌రూ చెప్పే ఒకే మాట‌....జ‌క్క‌న్న‌. రాజ‌మౌళి తీసిన ప్ర‌తీ సినిమా హిట్ అయింది. చాలా మంది హీరోల‌ను ప్ర‌పంచ స్థాయికి తీసుకువెళ్లారు. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, సునీల్‌, నాని లాంటి హీరోల‌తో సినిమాలు చేసి.. వాళ్ల కెరీర్ మార్చారు. ముఖ్యంగా ప్ర‌భాస్ చేసిన బాహుబ‌లి సిరీస్, ఎన్టీఆర్ -చ‌ర‌ణ్ కాంబోలో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ రేంజ్ ను పెంచాయి.

ఇక ఇప్పుడు ప్రిన్స్ మ‌హేష్ బాబుతో సినిమా చేస్తున్నారు జ‌క్క‌న్న‌. ఈ సినిమా హ‌లీవుడ్ రేంజ్ లో తెర‌కెక్కిస్తున్నారు. విదేశాల‌లో ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే.. ఇలాంటి నేప‌థ్యంలో.... జ‌క్క‌న్న మ‌న‌సు మ‌రో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తోంద‌ట‌. ఈ మేర‌కు టాలీవుడ్ స‌ర్కిల్స్ లో ఓ న్యూస్ వైర‌ల్ గా మారింది.

పుష్ప‌తో దుమ్ములేపిన అల్లు అర్జున్ తో సినిమా చేయాల‌ని రాజ‌మౌళి అనుకుంటున్నార‌ట‌. ఈ మేర‌కు క‌థ సిద్ధం చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. అటు బ‌న్నీ ఫ్యాన్స్ ఇదే కోరుకుంటున్నారు. అయితే.. ఈ సినిమా ప‌ట్టాలు ఎక్కాలంటే... 2029 రావాల్సిందేన‌ని చ‌ర్చ కూడా మొద‌లైంది. మ‌హేష్ బాబుతో సినిమాలో అయ్యాక‌.. ఈ సినిమాపై ప్ర‌క‌ట‌న వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు.

Next Story