- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajamouli-Mahesh Babu: ‘SSMB 29’ సినిమాలో హీరోయిన్‌గా గ్లోబల్ సెన్సేషన్, విలన్‌గా ఆ నటుడు ఫిక్స్..?(పోస్ట్)
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమా ‘SSMB 29’.

దిశ, సినిమా: దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమా ‘SSMB 29’. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంపై అభిమానులు మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం భారీ అంచనాలను పెట్టుకుంది. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్.. తన టైమ్ మొత్తాన్ని జక్కన్న చేతిలో పెట్టేశాడు. ఇక ఈ సినిమా అమెజాన్ అడవులను బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కుతుంది. మూడేళ్ళుగా ఈ సినిమా కథ కోసమే జక్కన్న చాలా వర్క్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇంకోపక్క మహేష్.. ఈ సినిమా కోసం లుక్‌ను సైతం మొత్తం మార్చేశాడు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ అయింది. మరి ఇంతకీ ఆమె మరెవరో కాదండోయ్ గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంక చోప్రా. అప్పుడప్పుడు బాలీవుడ్‌లో మెరుస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు SSMB29 తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందట. ఎప్పటినుంచో ఈ వార్తలు వినిపిస్తున్నా.. ఇది కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. అలాగే ప్రియాంకతో పాటు.. 'SSMB29' లో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 'సలార్' సినిమాతో పాన్ ఇండియా నటుడుగా మారిన మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడని ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో రాజమౌళి, మహేష్ సినిమాపై మరింత హైప్ పెరిగిపోయింది అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.






