- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షూటింగ్‌లో రాజమౌళి టార్చర్ పెడుతున్నారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ షాకింగ్ కామెంట్స్!
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘SSMB-29’సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి.

దిశ, సినిమా: సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘SSMB-29’సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. అంతటా ఈ సినిమా సందడి మొదలైపోయింది. మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి (Rajamouli)కాంబోలో రాబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘వారణాసి’(Vaaranaasi)టైటిల్ ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశారు. ఇక ఈ అప్డేట్స్‌ను విడుదల చేసేందుకు నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ‘Globetrotter’ పేరుతో ఓ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించి అభిమానులకు వరుస సర్‌ప్రైజులు ఇచ్చారు.
ఇందులో ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా నటిస్తుండగా.. పథ్వీరాజ్ సుకుమారణ్ కుంభ పాత్రలో కనిపించనున్నాడు. ఇక మహేష్ బాబు రుద్ర అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. పురాణాలలో, సంస్కృతిలో అండ్ పండుగలలో కనిపించే బసవ ఎద్దుపై వస్తున్న లుక్‌లో ఫ్యాన్స్‌కు ఫుల్ మీట్స్ పెట్టేశాడు రాజమౌళి. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘రాజమౌళి గారు నా తదుపరి సినిమాలో విలన్ పాత్ర చాలా బాగా వచ్చిందని నాకు మెసేజ్ చేశారు. ఆ తర్వాత ఒకచోట కలుసుకున్నాం.
ఐదు నిమిషాల స్టోరీ చెప్పగానే ‘వారణాసి’ చేయడానికి ఒప్పుకున్నాను. ఆ తర్వాత మూడు గంటల పాటు కథ చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. రాజమౌళిలా మరొకరిని ఊహించలేకపోయాను. ఆయన ఎంతగానో నమ్మి కుంభ పాత్ర నాకు ఇచ్చారు. శారీరకంగా, మానసికంగా నాకు సవాలు విసిరింది. రాజమౌళి నిజంగా షూటింగ్ టార్చర్ పెడుతున్నారు. నేను చాలా భాషల్లో చాలా సినిమాలు చేశాను, కానీ ఈ స్థాయిలో లాంచ్ ఎక్కడా చూడలేదు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






