‘మహాభారతం’ ఏకంగా 10 పార్ట్‌లలో.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

by Disha Web Desk 9 |
‘మహాభారతం’ ఏకంగా 10 పార్ట్‌లలో.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
X

దిశ, సినిమా: కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు భారీ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు దర్శకుడు రాజమౌళి. తాజాగా ఆస్కార్‌తో దేశం గర్వించేట్లుగా ప్రపంవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తన అప్‌కమింగ్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. కానీ రాజమౌళి చేయాల్సిన అసలు సిసలు చిత్రం ఇంకోటి ఉంది. అదే ‘మహాభారతం’. ఇప్పటికే మహాభారతాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సినిమాలు చేసిన ఆయన.. నేరుగా మహాభారతాన్ని తీయడమే తన అంతిమ కలగా పెట్టుకున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి.. ఈ ‘మహాభారతం’ చిత్రాన్ని 10 భాగాలుగా చేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో ఈ అప్డేట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. ఇక జక్కన చిత్రం అంటే ప్రేక్షకులకుండే క్యూరియాసిటే వేరు. కాగా మరి ఈ మూవీ ఎప్పుడు మొదలెడతారు? ఏ యాక్టర్‌ని తీసుకుంటారు? అనే విషయాలపై చర్చ జరుగుతోంది.

Also Read..

అదిరిపోయిన ‘ఆదిపురుష్’ ట్రైలర్.. మూడు నిమిషాల్లో రామాయణ గాథ చెప్పేశారు!!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed