Rajamouli: 11ఏళ్ల చిన్నారి అవార్డ్ అందించడంపై మురిసిపోతున్న జక్కన్న.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 10 |
Rajamouli: 11ఏళ్ల చిన్నారి అవార్డ్ అందించడంపై మురిసిపోతున్న జక్కన్న.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: అంతర్జాతీయ వేదికపై 11ఏళ్ల చిన్నారి తనకు అవార్డ్ అందించండంపై డైరెక్టర్ రాజమౌళి ఆనందం వ్యక్తం చేశాడు. ఆయన తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌లో 4 కేటగిరీల్లో అవార్డులను అందుకుంది. కాగా బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీకిగానూ జక్కన్న.. చరణ్‌లు ‘ఈ హెచ్ సీఏ’ అవార్డ్స్ అందుకున్నారు. అయితే ఈ మధురమైన క్షణాలకు సంబంధించిన ఫొటోను నెట్టింట పోస్ట్ చేసిన దర్శకుడు.. ‘నమ్మశక్యం కానీ, ప్రతిభావంతులైన 11ఏళ్ల @violetmcgraw ఈ వేదికపై నాకు అవార్డ్ అందించినప్పుడు నేను చాలా సంతోషించాను. ఆ తర్వాత ఆమె నన్ను సెల్ఫీ అడగటంతో మరింత ఆనందానికి లోనయ్యాను’ అంటూ అమెరికన్ చైల్డ్ ఆర్టిస్ అయిన వైలెట్ మెక్‌గ్రాతో కూడిన పిక్స్ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ మురిసిపోయాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed