‘Adipurush’లో రాముడి క్యారెక్టర్ బోరింగ్.. ‘బాహుబలి’ని రామాయణంతో పోల్చిన రాజమౌళి

by Dishanational2 |
‘Adipurush’లో రాముడి క్యారెక్టర్ బోరింగ్.. ‘బాహుబలి’ని రామాయణంతో పోల్చిన రాజమౌళి
X

దిశ, సినిమా: ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక సినిమాపై రాజమౌళి తన ఫీలింగ్స్ బయటపెట్టాడు. ఇలాంటి కథనాన్ని తీయడం ఎవరి వల్ల కాదంటూ ప్రశంసలు కురిపించాడు. అలాగే రాముడు క్లాస్ క్యారెక్టర్, సైలెంట్ బోరింగ్ క్యారెక్టర్ అయినప్పటికీ.. తన చుట్టూ ఉన్న హనుమంతుడు లక్ష్మణుడు పాత్రలు బలమైనవిగా వివరించారు జక్కన్న. ‘‘బాహుబలి’ సిరీస్‌లో అమరేంద్ర బాహుబలి పాత్ర రాముడి లాంటిదే. ఆయన స్వచ్ఛమైన హృదయం కలిగి ఉంటారు. అతని చుట్టూ ఉన్న శివగామి, కట్టప్ప, దేవసేన వంటి బలమైన పాత్రల ద్వారా అమరేంద్ర బాహుబలి పాత్ర ఎలివేట్ అవుతుంది. ఈ బలమైన పాత్ర పోషించిన వారు బాహుబలికి ప్రాణం ఇవ్వడానికి వెనకాడరు. ఇక్కడ రామాయణంలో కూడా అంతే. రాముడి కోసం లక్ష్మణుడు, హనుమంతుడు కూడా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు’ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Read More: వివాదాలను ఎదుర్కొంటూనే ‘Adipurush’ ఫస్ట్ డే కలెక్షన్స్‌ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

Next Story

Most Viewed