- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajamouli: శివరాత్రికి సూపర్‌స్టార్ అభిమానులకు రాజమౌళి బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారా.. ఏం చెప్పనున్నారు?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి అండ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు జత కట్టిన విషయం తెలిసిందే. ప్రి

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) అండ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)జత కట్టిన విషయం తెలిసిందే. ప్రిన్స్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్టులో నటిస్తున్నారు. జక్కన్నతో సినిమా అంతే మామూలు విషయం కాదు.. అభిమానులు ఇప్పటికే ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేసుకున్నారు. సినిమా కోసం ప్రాణం పెట్టే రాజమౌళితో సినిమా తీస్తే ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం పక్కా అని నెటిజన్ల భావన.
ఈ మూవీ అమెజాన్ అడవుల్లో సాగుతుందట. కాగా అక్కడి ట్రైబ్స్ ను బేస్ చేసుకుని రూపొందిస్తోన్న చిత్రం కాబట్టి సూపర్ స్టార్ కాస్త ఎక్కువగానే కష్టపడాల్సి వస్తుంది. పైగా రాజమౌళికి ఏ చిన్న టేక్ అయినా ఫర్ఫెక్ట్‌గా వచ్చేవరకు వదిలిపెట్టడు. దాదాపు ఈ చిత్రం పూర్తి అయ్యేవరకు రెండేళ్లు దాటుతోందని.. అప్పటివరకు వెయిట్ చేయడం కష్టం అంటూ అభిమానులు ఇప్పటినుంచే ఈగర్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.
ఇకపోతే రాజమౌళి.. ఈ శివరాత్రికి సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట. మరీ ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఓ గాసిప్ వైరల్ అవుతోంది. చిత్రీకరణకు ముందే ఓ ప్రెస్ మీట్ పెట్టి బేసిక్ స్టోరీలైన్ చెప్పడం రాజమౌళికి అలవాటు అంటూ నెటిజన్లు అంచనా వేస్తున్నారు. కాగా అదే ప్రెస్‌మీట్ శివరాత్రి రోజున (ఫిబ్రవరి 26) నిర్వహించి.. మూవీకి సంబంధించిన విషయాలు చెప్పి.. సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్నాడట. ఇక ప్రిన్స్ నటిస్తోన్న ఈ బిగ్ ప్రాజెక్ట్ చిత్రీకరణ హైదరాబాదు అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుందని సమాచారం.






