Raja Saab: సంక్రాంతి స్పెషల్ ట్రీట్‌గా 'రాజా సాబ్' నుంచి క్రేజీ అప్‌డేట్..? వైరల్ అవుతున్న న్యూస్

by Gugulothu.Kavitha |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ‘రాజా సాబ్’ ఒకటి.

Raja Saab: సంక్రాంతి స్పెషల్ ట్రీట్‌గా రాజా సాబ్ నుంచి క్రేజీ అప్‌డేట్..? వైరల్ అవుతున్న న్యూస్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ‘రాజా సాబ్’ ఒకటి. మారుతీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హారర్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ మూవీలో సంజయ్ దత్, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న ‘జాక్’ మూవీ కూడా ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంది అని రీసెంట్‌గా ఆ చిత్రబృదం అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక అప్పటి నుంచి రాజా సాబ్ సినిమా ఆ తేదిన రిలీజ్ కాదని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉండడం వల్లనే ఏప్రిల్ మంత్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం లేదని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా అధికారిక విడుదల తేదీని సంక్రాంతి కానుకగా కొత్త పోస్టర్‌తో ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story