- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెక్స్ట్ ఎవరు బకెట్ తన్నేస్తారో చెప్పబోతున్న రాజ్ తరుణ్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక ఇప్పుడు ఆయన ఓ మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌తో రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సిరీస్ ఆహా వీడియో ఓటీటీలోకి రాబోతున్నట్లు వెల్లడించారు. ఈ పోస్ట్‌కు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు. ‘‘అందరి ఆయుష్షు అతి త్వరలోనే చెప్పేస్తాం. చిరంజీవ( chiranjeeva) టీజర్ త్వరలోనే రానుంది’’ అని రాసుకొచ్చారు. అలాగే రాజ్ తరుణ్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. అయితే ఇందులో ఆ పోస్టర్‌లో నెక్ట్స్ బకెట్ తన్నేసేది ఎవరు అని రాసి ఉండటం విశేషం.
అలాగే దీనిపై భూమిపై ఉండడానికి ఎంత సమయం మిగిలి ఉందో రాసి ఉంది. అయితే త్వరలోనే ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్ కూడా రాబోతున్నట్లు ఆహా వెల్లడించింది. అంతేకాకుండా స్ట్రీమింగ్ అందుబాటులోకి కూడా రాబోతున్నట్లు తెలిపారు. అయితే ‘చిరంజీవ’ సిరీస్‌ను ప్రముఖ కమెడియన్ అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ తెరకెక్కిస్తుండగా.. దీనిని రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ వెబ్ సిరీస్‌ను అన్ని రకాల వయసు గల ప్రేక్షకులను ఆకట్టుకునే ఆసక్తికర కంటెంట్‌తో తీసుకురాబోతున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది.






