ప్రతిరోజు 16 గంటలు.. వారానికి ఒకరోజు మొత్తం.. అదే నా సీక్రెట్

by Disha Web Desk 6 |
ప్రతిరోజు  16 గంటలు.. వారానికి ఒకరోజు మొత్తం.. అదే నా సీక్రెట్
X

దిశ, సినిమా: స్టార్ సింగర్ రాహుల్ వైద్య తన ఫిట్ నెస్ సీక్రెట్స్ ఏంటో చెప్పేశాడు. ఇటీవల సిక్స్ ప్యాక్ బాడీతో కూడిన పలు ఫొటోలను నెట్టింట షేర్ చేయగా తెగ వైరల్ అయ్యాయి. దీంతో తన శరీర ధృడత్వానికి కారణమేంటో చెప్పాలంటూ ఫాలోవర్స్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా స్పందించిన రాహుల్.. ప్రతిరోజు 16 గంటల ఉపావాసమే తనను స్ట్రాంగ్‌గా ఉంచుతుందని చెప్పాడు.

అలాగే ప్రతి గురువారం పూర్తిగా నీళ్లు మాత్రమే తీసుకుంటానని వెల్లడించాడు. అయితే తనలాగా అందరి శరీరాలు ఉపవాసం అంగీకరించలేవని, ఒకవేళ ఎవరైనా తనలా ప్రయోగాలు చేయాలనుకుంటే తప్పకుండా వైద్య నిపుణిడితో మాట్లాడిన తర్వాత ఫాస్టింగ్ ఉండాలని కోరాడు. చివరగా ధృడమైన శరీరం కోసం బలమైన మనస్తత్వం కూడా కలిగివుండాలని సూచించాడు.

Read More... ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్ (వీడియో)



Next Story