ఇన్నాళ్లకు పునర్నవిని కలిసిన రాహుల్ సిప్లగంజ్.. కారణం అదేనా?

by Disha Web Desk 9 |
ఇన్నాళ్లకు పునర్నవిని కలిసిన రాహుల్ సిప్లగంజ్.. కారణం అదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజన్-3 లో కంటెస్టెంట్‌గా పాల్గొని విన్నర్‌గా బయటికొచ్చిన రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలంగాణ ముద్దుబిడ్డగా రాహుల్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా మారు మోగిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట పాడి.. ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఇదంతా పక్కన పెడితే..

బిగ్‌బాస్ సీజన్-3లో రాహుల్‌తో పాటు కంటెస్టెంట్‌గా పాల్గొన్న పునర్నవి భూపాళం అల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. వీరిద్దరూ హౌస్‌లో లవ్ ట్రాక్ నడిపారు. రాహుల్ స్టార్టింగ్‌లో ఆమెను పడేయడానికి ఓ రేంజ్‌లో ట్రై చేశాడు. పునర్నవి కూడా రాహుల్‌కు బాగానే ఎంకరేజ్ చేసింది. పున్నుతో ఎంత క్లోజ్‌గా మూవ్ అయినా రాహుల్ ఫోకస్ తప్పకుండా గేమ్స్ ఆడి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చాక కూడా వీరిద్దరూ పలు షోలకు గెస్ట్‌లుగా హాజరై.. సందడి చేశారు. ఇక పునర్నవి అడపదడపా సినిమాల్లో కనిపించినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. తర్వాత ఏదో వ్యాధి వల్ల విదేశాలకు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది.

అయితే చాలా గ్యాప్ తరువాత ఈ జంట మరోసారి కలిసి అభిమానులను షాక్ ఇచ్చారు. తాజాగా రాహుల్ ‘నీ అయ్య నా మామ అంటూ సాగే పాటలో నటించి.. పాడిన ఒక మ్యూజిక్ ఆల్బమ్‌ను పునర్నవి విడుదల చేసింది. దుబాయ్‌లో ఈ పాట షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాహుల్. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ఓ పున్ను.. ఎన్నాళ్లకెన్నాళ్లకు రాహుల్‌‌తో కనిపించావ్ అంటూ కామెంట్స్ చేయగా.. రతికకు కోపం రావాలని కావాలనే పునర్నవితో ఈ సాంగ్ రిలీజ్ చేయించి.. పిక్స్ నెట్టింట పోస్ట్ చేశాడు అంటూ మరికొందరు చర్చించుకుంటున్నారు.



Next Story

Most Viewed