- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Khatija: రూమర్స్‌కు చెక్ పెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ కుమార్తె..?
ప్రముఖ మ్యూజిక్ దర్శకుడు ఏఆర్ రెహమాన్(Music director AR Rahman) ఇటీవలే తమ వివాహ బంధానికి ముగింపు పలికారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మ్యూజిక్ దర్శకుడు ఏఆర్ రెహమాన్(Music director AR Rahman) ఇటీవలే తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో ఎక్కడచూసినా.. రెహమాన్ అండ్ ఈయన భార్య సైరా బాను(Saira Banu) వార్తలే కనిపిస్తున్నాయి. తాజాగా ఈ సంగీత దర్శకుడు మ్యూజిక్‌కు బ్రేక్ ఇవ్వనున్నారంటూ కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తోందంటూ జనాలు చర్చించుకుంటున్నారు. ఇక రెహమాన్ సంగీతాన్ని వదులుకుంటున్నారా? అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ వార్తలపై ఈ మ్యూజిక్ డైరెక్టర్ డాటర్ ఖతీజా స్పందించింది.
దయచేసి ఈ రూమర్స్ క్రియేట్ చేయడం ఇంతటితో ఆపేయండని తెలిపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం అంటూ వార్తలు రాశారని.. అలా రాయడం కరెక్ట్ కాదంటూ వెల్లడించింది. డివోర్స్ బాధ నుంచి బయటకు రావడానికి రెహమాన్‌కు సంవత్సరం పట్టిందని తెలిపింది. అలాగే రెహమాన్ డివోర్స్ ప్రకటించినప్పుడే ఆయన టీమ్ నుంచి మరో వ్యక్తి కూడా తమ హస్బెండ్ నుంచి విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై కూడా ఖతీజా(Khatija) స్పందించి.. అసత్య ప్రచారం చేయొద్దని.. రూమర్స్‌కు చెక్ పెట్టింది.






