- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభిమాని టాలెంట్‌కు ఫిదా అయిపోయిన రాఘవ లారెన్స్.. ఆయన చేసిన పనికి అంతా షాక్ (వీడియో)
తమిళ హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్(Raghava Lawrence) గురించి ఎంత చెప్పినా తక్కువే.

దిశ, సినిమా: తమిళ హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్(Raghava Lawrence) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓ వైపు హీరోగానే కాకుండా సేవా కార్యక్రమాలతో దేవుడిలా మారిపోతున్నాడు. నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవడంతో పాటు తన సామాజిక కార్యక్రమాలతో ఎంతోమంది ప్రశంసలు పొందుతూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. చారిటబుల్ ట్రస్ట్ తో పాటు ఎంతోమంది స్టూడెంట్స్‌కు అండగా నిలుస్తున్నాడు. ఇటీవల తన సొంత ఇంటిని పాఠశాలగా మార్చి అందె ఇంట్లోకి వెళ్లి గొప్ప మనసు చాటుకున్నాడు. తాజాగా, ఓ అభిమాని టాలెంట్ చూసి ఫిదా అయిపోయిన రాఘవ తనపై నోట్ల వర్షం కురిపించాడు. తన డ్యాన్స్‌తో మెప్పించిన వ్యక్తిని ఆకాశానికెత్తేశాడు. ఓ వీడియోను షేర్ చేస్తూ ‘‘అందరికీ హాయ్.. నా దివ్యాంగుల అబ్బాయిలతో నేను ఇప్పటివరకు పంచుకున్న అద్భుతమైన ప్రయాణం మీ అందరికీ తెలుసు.
నేను నృత్యకారుడిగా ఉన్న రోజుల్లో, ప్రేక్షకులు తరచుగా రూ. 1 నోట్స్‌ను పిన్ చేసి, వాటిని నాపై దండలుగా ఉంచేవారు. ఇది కృతజ్ఞతా చిహ్నంగా ఉండేది. నా అబ్బాయిల కోసం అదే ఆనందాన్ని తిరిగి సృష్టించాలనుకున్నాను. ఆశ్చర్యకరంగా, నేను వారి ప్రతిభకు ప్రశంస చిహ్నంగా మాత్రమే కాకుండా, వారిని ప్రోత్సహించడానికి కూడా నోట్స్‌తో వారిపై వర్షం కురిపించాను. మీ ఈవెంట్‌లు లేదా ఫంక్షన్లలో ప్రదర్శన ఇవ్వడానికి వారికి అవకాశం ఇవ్వాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. వారి ప్రదర్శన దీన్ని చూసే ప్రతి ఒక్కరినీ ప్రేరేపిస్తుందని, ఆనందాన్ని కలిగిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నా అబ్బాయిలతో నేను పంచుకునే బంధం నిజంగా ప్రత్యేకమైనది. ఇది ఎల్లప్పుడూ నా హృదయంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది’’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షాక్ అవుతూ లారెన్స్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.






