- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న రాధికా ఆప్టే.. ఇకపై అలా చేయనంటూ షాకింగ్ కామెంట్స్
నటి రాధికా ఆప్టే(Radhika Apte) అందాల ఆరబోతకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిపోయి, దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, సినిమా: నటి రాధికా ఆప్టే(Radhika Apte) అందాల ఆరబోతకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిపోయి, దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం వంటి పలు భాషల్లో నటిస్తూ దూసుకుపోతుంది. నటన, గ్లామర్ రెండింటిలోనూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న రాధికా.. ఇప్పుడు తల్లి అయినప్పటికీ కెరీర్‌లో ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా ముందుకు సాగుతోంది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరుస ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇటీవల విడుదలైన ‘సాలీ మోహబత్’ (Sali Mohabbat)చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించిన రాధికా.. తన పర్ఫార్మెన్స్‌కు మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆమె కెరీర్ పూర్తిగా పీక్ ఫేజ్‌లో కొనసాగుతోందని చెప్పాలి. ఇక సినిమాలతో పాటు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ, తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
తాజాగా, ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధికా ఆప్టే.. పని గంటల విషయంలో తాను కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘వారం రోజులపాటు నా బిడ్డను చూడకుండా ఉండడం నాకు అస్సలు సాధ్యం కావడం లేదు. అందుకే నా పని వేళల విషయంలో హద్దులు పెట్టుకున్నాను’ అని అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘షూటింగ్ గంటలను మార్చాల్సిన అవసరం చాలా ఉందని నటి రాధికా ఆప్టే స్పష్టం చేసింది. వారం రోజుల పాటు తన బిడ్డను చూడకుండా ఉండాలని ఆశించడం అన్యాయమని, అందుకే సుదీర్ఘమైన షిఫ్టులకు తాను ఒప్పుకోనని చెప్పింది. ఈ నిర్ణయం కోసం ఎన్నో వాదనలు, గొడవలు కూడా ఎదురయ్యాయని తెలిపింది.
అమ్మమ్మ లేదా నాన్నమ్మను సెట్‌కు తీసుకురావడం పరిష్కారం కాదని, మాతృత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం తనకు ముఖ్యమని వెల్లడించింది.ఇకపై సినిమాలు సైన్ చేసేటప్పుడు కొన్ని కఠినమైన నిబంధనలు పెట్టాలని రాధికా నిర్ణయించకున్నట్లు పేర్కొంది. రోజుకు గరిష్టంగా 12 గంటల షిఫ్ట్ మాత్రమే, అందులో ప్రయాణం, మేకప్, హెయిర్, షూటింగ్ అన్నీ కలిపే ఉండాలని చెప్పింది. ప్రయాణానికి రెండు గంటలు పడితే దానిని కూడా పని గంటలుగా పరిగణించాలని, వీలైనంత వరకు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయాలని, తప్పనిసరిగా వారపు సెలవు ఉండాలని స్పష్టం చేసింది. చిన్న సినిమాల విషయంలో మాత్రమే కొన్ని మినహాయింపులు ఇస్తానని తెలిపింది.






