ఆ క్షణం ఒక యుగంలా గడిచింది: 1981లో బికినీ ధరించడంపై రాధా

by Disha Web Desk 7 |
ఆ క్షణం ఒక యుగంలా గడిచింది: 1981లో బికినీ ధరించడంపై రాధా
X

దిశ, సినిమా : ‘టిక్ టిక్ టిక్’ సినిమాలో బికినీ ధరించడం వెనకున్న కష్టాలపై రాధా నాయర్ ఓపెన్ అయింది. కమల్ హాసన్ హీరోగా 1981లో వచ్చిన ఈ మూవీ బికినీ సన్నివేశాన్ని ప్రదర్శించిన మొదటి తమిళ చిత్రంగా నిలిచింది. ఈ మేరకు సహనటులు స్వప్న, మాధవితో కలిసి బికినీ వేసుకుని సెట్‌లోకి వెళ్లడం ఒక పోరాటంగా అనిపించిందన్న రాధా.. ‘అప్పట్లో అది ఉద్యోగంలో భాగమని అనుకునేవాళ్లం. అయితే ఆ క్షణం మాకు ఒక యుగంలా అనిపించేది. దీనికి చాలా బలం, పోరాటం అవసరమని భావించాం. మొత్తానికి బికినీ ధరించినందుకు మాపై ప్రశంసల వర్షం కురిసింది. ‘టిక్ టిక్ టిక్’ సినిమా షూటింగ్‌లో నాకు ఇష్టమైన జ్ఞాపకాలలో ఇదొకటి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అలా కనిపించడానికి మేము చేసిన సాహసం, శక్తిని మెచ్చుకుంటున్నాం’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది.

ఇవి కూడా చదవండి:

చిన్న పిల్లలకు లిప్ లాక్ కిస్‌లు ఇస్తూ రెచ్చి పోయిన నటి.. ఏకిపారేస్తున్న నెటిజన్లు



Next Story

Most Viewed