- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెట్స్‌లో సిద్ధు అలా చేస్తాడని ఊహించలేదు.. ప్రవర్తన చూసి షాక్ అయ్యానంటూ రాశీ ఖన్నా ఆసక్తికర కామెంట్స్
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna)‘తెలుసు కదా’(telusu kada) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna)‘తెలుసు కదా’(telusu kada) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ప్రమోషన్స్ జోరు పెంచిన రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) గురించి అందరూ అనుకున్నట్లే నేను కూడా చాలా సరదాగా ఉంటాడని అనుకున్నాను. కానీ ‘తెలుసు కదా’ సెట్స్‌లో అతన్ని చూసి నేను నిజంగా షాక్ అయ్యాను. షూటింగ్‌లో చాలా సీరియస్‌గా ఉండేవాడు. ఫ్రేమ్ సెట్ చేయగానే మళ్లీ వెంటనే పాత్రలోకి పూర్తిగా లీనమై పోయేవాడు. సిద్ధు తన పనిని, నటనకు చాలా గౌరవిస్తాడు. అందుకే పని విషయంలో అతను అంత సీరియస్‌గా ఉంటాడు. నేను అలా చేస్తాడని ఊహించలేదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ గురించి తెలుసుకున్న వారు కూడా ఆశ్చర్యపోతున్నారు.






