ప్రముఖ సింగర్ 'క్వీన్ ఆఫ్ రాక్ ఎన్ రోల్' టీనా టర్నర్ కన్నుమూత

by Disha Web Desk 12 |
ప్రముఖ సింగర్ క్వీన్ ఆఫ్ రాక్ ఎన్ రోల్ టీనా టర్నర్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ టీనా టర్నర్ 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు. "క్వీన్ ఆఫ్ రాక్ అండ్ రోల్" పేరుగాంచిన ఆమె స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ సమీపంలోని కుస్నాచ్ట్‌లోని తన ఇంట్లో మృతి చెందింది. గత కొంత కాలంగా క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆమె.. ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కాగా టీనా టర్నర్ మొత్తం ఎనిమిది గ్రామీ అవార్డుల్లో ఆరింటిని గెలుచుకుంది. ఆమె మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Next Story

Most Viewed