- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఎటు చూస్తే అటువైపు సాయి బాబా తిరిగి నన్ను చూశారు.. నటి పోస్ట్ వైరల్
టాలీవుడ్ నటి ఇంద్రజ ఒకప్పుడు హీరోయిన్‌గా నటించింది. యమలీల, సమ్మక్క సారక్క, సూపర్ స్టార్ నటించిన జగదేక వీరుడు వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది..

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి ఇంద్రజ ఒకప్పుడు హీరోయిన్‌గా నటించింది. యమలీల, సమ్మక్క సారక్క, సూపర్ స్టార్ నటించిన జగదేక వీరుడు వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కొన్నాళ్ల నుంచి ఇంద్ర సినిమా లకు ఉంది. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి పలు సీనిమాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తూనే.. శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు జడ్జిగా వ్యవహరిస్తుంది.
అయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తుంది. తాజాగా, ఇంద్రజ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఓ వీడియోను షేర్ చేసింది. ''ఇది నాకు చాలా స్పెషల్ ఫొటో. ఓ సారి యూట్యూబ్‌లో సర్చ్ చేస్తునప్పుడు నాకు ఈ రీల్ కనిపించింది. ఇది క్రియేట్ చేసిన వారు ఎవరో కానీ, చాలా అద్భుతంగా చేశారు. దీనిలో నేను ఇటువైపు నవ్వుతున్నట్టుగా ఉంటే అప్పుడు సాయిబాబా నా వైపు చూస్తున్నట్లు క్రియేట్ చేశారు. ఈ ఫొటోలో సాయి బాబా నా వైపు చూసినట్లు ఉంటే.. మరో ఫొటోలో ఎదురుగా చూస్తున్నట్లు ఉంది. చూడగానే నాకు చాలా సంతోషం కలిగింది. నేను రోజూ కొలిచే దైవం నిజంగా నా వైపు చూసినట్టు అనిపించింది. నాకు పుట్టపర్తి సాయిబాబా అంటే ఎంతో భక్తి. ఈ ఫొటో నాకు ఎంతో నచ్చింది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని భావించాను. అందుకే ఈ వీడియోను షేర్ చేశాను. దేవుడు నన్ను దీవించినట్టుగా అనిపిస్తుంది'' అనే క్యాప్షన్‌ను జత చేసి ఇంద్రజ షేర్ చేశారు.






