పీవీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం-1 షూటింగ్ ప్రారంభం!

by Harish |   (  Updated:2023-10-12 06:54:42  IST  )

రామ్ తేజ్‌, గ‌రిమ జంట‌గా పీవీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై ప్రొడ‌క్షన్ నెం-1గా రాబోతున్న సినిమా షూటింగ్ ఫిలించాంబ‌ర్‌లో ఘనంగా ప్రారంభమైంది.

పీవీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం-1 షూటింగ్ ప్రారంభం!
X

దిశ, సినిమా: రామ్ తేజ్‌, గ‌రిమ జంట‌గా పీవీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై ప్రొడ‌క్షన్ నెం-1గా రాబోతున్న సినిమా షూటింగ్ ఫిలించాంబ‌ర్‌లో ఘనంగా ప్రారంభమైంది. అక్షయ్ కృష్ణ న‌ల్ల ద‌ర్శక‌త్వంలో పీవీఆర్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన 'టీపీసీసీ' ఛైర్మన్ డా.ప్రతాని రామ‌కృష్ణ గౌడ్ ముహ‌ర్తపు స‌న్నివేశానికి క్లాప్ కొట్టగా నిర్మాత రామ‌స‌త్యనారాయ‌ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

అలాగే కాన్సెప్ట్ బాగుంటే కొత్త, పాత‌, చిన్నా, పెద్ద అని చూడ‌కుండా ప్రేక్షకులు సినిమాల‌ను ఆద‌రిస్తారని, కంటెంట్ బావుంటే సినిమాల‌ను ఆద‌రించ‌డానికి అభిమానులు ఎప్పుడూ ముందుంటారంటూ మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇక ఒక మంచి కంటెంట్‌తో రూపొందుతోన్న చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకున్న దర్శకనిర్మాతలు ప్రస్తుతం అమ్మాయిల‌పై జరుగుతున్న అఘాయిత్యాలతో కూడిన కథలో ప్రతి స‌న్నివేశం రియాలిటీకి ద‌గ్గర‌గా ఉండేలా చూస్తూ మంచి సందేశాన్ని అందించే ప్రయ‌త్నం చేస్తున్నట్లు తెలిపారు. మ‌ధుప్రియ‌, కావ్య, అజ‌య్ ఘోష్‌, సుమ‌న్‌, చిత్రం శ్రీను, నాగ‌రాజు, రానా, న‌రేష్ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Next Story