‘ది రాజాసాబ్’ విడుదలపై నిర్మాత షాకింగ్ కామెంట్స్.. వాయిదా పడటంపై క్లారిటీ

by Mallepaka Hamsa |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘ది రాజాసాబ్’(The Rajasaab).

‘ది రాజాసాబ్’ విడుదలపై నిర్మాత షాకింగ్ కామెంట్స్.. వాయిదా పడటంపై క్లారిటీ
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘ది రాజాసాబ్’(The Rajasaab). హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా కనిపించనుండగా.. నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్, మాళవిక మోహనన్, యోగిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా పలుసార్లు వాయిదా పడింది. ఈక్రమంలో.. మూవీ మేకర్స్ డిసెంబర్ 5న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తామని అధికారిక ప్రకటన విడుదల చేశారు.

అయితే ‘ది రాజా సాబ్’ మరోసారి వాయిదా పడనున్నట్లు గత కొద్ది కాలంగా పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వూలో పాల్గొన్న నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ది రాజాసాబ్ సినిమాను సంక్రాంతి విడుదల చేస్తే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. వారి హీరోను పెద్ద పండుగలు బిగ్ స్క్రీన్‌పై చూసుకోవాలని భావిస్తున్నారు. అలాగే తెలుగు బిజినెస్ సర్కిల్ వారు కూడా ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేయాలని చెబుతున్నారు. హిందీ ఆడియన్స్ మాత్రం డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని బలంగా కోరుకుంటున్నారు.

ఎందుకంటే అక్కడ డిసెంబర్‌లో అక్కడ పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి మా చిత్రాన్ని సంవత్సరం చివర్లో విడుదల చేయమని అంటున్నారు. ‘ది రాజాసాబ్’ షూటింగ్ అక్టోబర్ చివరి వరకు సినిమా అంతా కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ అంతా అయిపోయింది. కానీ కొన్ని పాటలు షూట్ చేయాలి. మొత్తం 4:30 గంటల సినిమా వచ్చి. దాన్ని ఎడిట్ చేసి కుదించాలి. ‘ది రాజాసాబ్’ కచ్చితంగా అందరినీ అలరిస్తుంది. త్వరలో విడుదలపై నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Next Story