బ్రహ్మానందంను ఘోరంగా అవమానించిన నిర్మాత.. ఫుల్ ఫైర్ అవుతున్న నెటిజన్లు (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-22 08:18:38  IST  )

తన కామెడీ టైమింగ్‌తో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించిన కమెడియన్‌లో బ్రహ్మానందం ఒకరు.

బ్రహ్మానందంను ఘోరంగా అవమానించిన  నిర్మాత.. ఫుల్ ఫైర్ అవుతున్న నెటిజన్లు (వీడియో)
X

దిశ, సినిమా: తన కామెడీ టైమింగ్‌తో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించిన కమెడియన్‌లో బ్రహ్మానందం ఒకరు. వేయికి పైగా సినిమాల్లో నటించిన ఆయన నటన ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి మెప్పించారు. స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం (Brahmanandam)69 ఏళ్ల వయసులోనూ విరామం తీసుకోకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లో కమెడియన్ కనిపిస్తూ తన కామెడీ డైలాగ్స్‌తో నవ్విస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఇంత అద్భుతమైన నటుడిని ఓ నిర్మాత అవమానించారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళితే.. ప్రముఖ నిర్మాత ఎస్‌కెఎన్(SKN) ‘కె-ర్యాంప్’ సక్సెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. పలు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఏమన్నారంటే.. కిరణ్ అబ్బవరం బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అందుకున్నాడు. అన్నా నేను సంవత్సరానికి రెండు మూడు చిత్రాలు చేస్తే చాలు అంటాడు. ఏ మూవీ కంఫర్ట్‌గా ఉండాలని ఏ రోజు అడగడు. కిరణ్ లాంటి హీరోల గురించి చెప్పుకుంటే ఇలాంటి హీరోలు ఉండడం ఇండస్ట్రీకి ముఖ్యం. అల్లు అర్జున్ (Allu Arjun)గారితో నేను చాలా సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాను.

ఆయన నటించిన ‘రేసుగుర్రం’ సినిమాలో చివర్లో బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ 15 నిమిషాల ఉంటుందని చూసుకోలేదు.. అది మూవీకి వర్కౌట్ అవుతుందని మాత్రమే అల్లు అర్జున్ చూశారు. ఆయన ఈ రోజు మంచి పొజిషన్‌లో ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందులో ఐకాన్ స్టార్‌ను గారు అని.. బ్రహ్మానందంను ఏకవచనంతో పిలిచి అవమానించాడని ఫ్యాన్స్ ఎస్‌కెఎన్‌పై మండిపడుతున్నారు.

లింక్

READ MORE .....

Producer Razesh Danda: నా యుద్దం మీడియా వారిపై కాదు ఆ వెబ్‌సైట్ మీదనే..దయచేసి నా బాధను అర్థం చేసుకోండి

Next Story