‘భోళా శంకర్’ సినిమా సూపర్ అంటూ నిర్మాత ట్వీట్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

by Disha Web Desk 6 |
‘భోళా శంకర్’ సినిమా సూపర్ అంటూ నిర్మాత ట్వీట్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా సినిమా ‘భోళా శంకర్’. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటించగా చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ నటించింది. ఈ మూవీ ఆగస్టు 11న థియేటర్స్‌లో విడుదలై యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. చాలా మంది డైరెక్టర్‌తో పాటు చిరంజీవిని కూడా ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ‘బేబీ’ సినిమా నిర్మాత SKN ‘భోళా శంకర్’ పై ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘‘మాస్-బాస్ మూవీ లవర్స్‌కి భోళా శంకర్ సెకాండాఫ్ కేక. సినిమాలో యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్‌తో పాటు ముఖ్యంగా బాస్ గ్రేస్‌ఫుల్ స్టెప్పులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన డ్యాన్స్ చూస్తే వింటేజ్ మెగాస్టార్ కనిపించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో చూస్తే ఈ సినిమా మ్యాటర్ తెలుస్తుంది. మెగాస్టార్ గ్రేస్‌ను మెహర్ రమేష్ చక్కగా ఉపయోగించుకున్నారు’’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా సూపర్ అంటూ ఎమోజీలను కూడా జత చేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు బాలేని సినిమా సూపర్ ఉందని ఎలా చెబుతావు అంటూ SKN‌ను ఏకిపారేస్తున్నారు. అంతేకాకుండా ఈ భజన దేనికోసం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story