- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా మీద బతికే లుచ్చా నా కొడకా.. నడిరోడ్డుపై ఉరితీస్తా.. హాట్ టాపిక్‌గా మారిన నిర్మాత వీడియో
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), యుక్తి తరేజా కాంబోలో వచ్చిన ‘కె-ర్యాంప్’ (K-Ramp)సూపర్ హిట్‌గా నిలిచింది.

దిశ, సినిమా: కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), యుక్తి తరేజా కాంబోలో వచ్చిన ‘కె-ర్యాంప్’ (K-Ramp)సూపర్ హిట్‌గా నిలిచింది. నరేష్ వీకే, సాయి కుమార్ కీలక పాత్రలో నటించగా.. జైన్స్ నాని (Jains Nani)దర్శకత్వంలో వచ్చింది. రాజేష్ దండా, శివ బొమ్మన నిర్మించారు. ఈ చిత్రం మంచి కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. అయినప్పటికీ ఓ న్యూస్ పోర్టల్ చెడుగా ప్రచారం చేస్తోంది. తాజాగా, ‘కె-ర్యాంప్’ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న నిర్మాత రాజేష్ దండా తప్పుడు వార్తలు రాస్తున్న వారిని హెచ్చరించారు. ‘‘మా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ ఒక వెబ్‌సైట్ మాత్రం ఇంకా మీ మీద ఏడుస్తుంది. వాడికి చెబుతున్నా, అమెరికాలో ఉన్న ప్రదీప్ గాడికి పగలగొడతా. నీకేం తెలుసురా లుచ్చా నా కొడకా? ఏదో వేస్తున్నావ్.. అది తెలుగు తమిళ్‌రా కుక్క. తొక్కుతావా సినిమాని? తొక్కరా నువ్వు మగాడివైతే. ఒక హిట్ చిత్రాన్ని ఇంకా తొక్కాలని చూస్తున్నా ఈ నా కొడుకు. ఇలాంటి వాళ్లని ఏం చేయాలి? మా మీద బతికే నా కొడకా? ఉరితీయాలి వీళ్ళని నడిరోడ్డు మీద’’ అంటూ ఫైర్ అయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.






