- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైవ్‌లోనే రిపోర్టర్‌కు లైన్.. ఇంకో హీరోయిన్‌తో ఎఫైర్.. ఈ నిర్మాత రసికుడే??!
నిర్మాత నాగవంశీ ఏ టాపిక్ అయినా ఓపెన్‌గా మాట్లాడేస్తాడు. బోల్డ్ టాక్స్‌తో కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తాడు. టాలీవుడ్ ముందు బాలీవుడ్ పనికి రాదనడం నుంచి రెమ్యూనరేషన్ తీసుకుని హీరోయిన్ అక్కడ కొట్టించుకుందామనుకున్నప్పుడు మీకేంటి నొప్పి లాంటి

దిశ, ఫీచర్స్ : నిర్మాత నాగవంశీ ఏ టాపిక్ అయినా ఓపెన్‌గా మాట్లాడేస్తాడు. బోల్డ్ టాక్స్‌తో కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తాడు. టాలీవుడ్ ముందు బాలీవుడ్ పనికి రాదనడం నుంచి రెమ్యూనరేషన్ తీసుకుని హీరోయిన్ అక్కడ కొట్టించుకుందామనుకున్నప్పుడు మీకేంటి నొప్పి లాంటి మాటలతో చాలా సార్లు వివాదాలకు సెంటర్ పాయింట్ అయ్యాడు. అయినా తగ్గేదేలే అన్నట్లు మాట్లాడుతనే ఉంటడు. అయితే తాజాగా ఆయన సినిమా మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్‌లో భాగంగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరయ్యాడు ఈ ప్రొడ్యూసర్. ఇందులో అడిగిన ప్రశ్నకు షాక్ అయ్యాడు.
‘‘మీకు ఆ హీరోయిన్‌కు ఎఫైర్ ఉందని టాక్ నడుస్తుంది. తిరుమల దర్శనానికి వెళ్లినా.. దుబాయ్‌కు వెళ్లినా.. ఆమె ఎక్కడికి వెళ్తే మీరూ అక్కడే కనిపిస్తున్నారు’’ అని అడగ్గా.. తిరుమల, దుబాయ్‌కు ఎంతో మంది వెళ్తారు యాక్సిడెంటల్‌గా ఆమె కూడా వచ్చిందేమో అని సమాధానమిచ్చాడు. ‘‘నాకు మీలాంటి సినిమా రిపోర్టర్స్‌ను ఫ్లర్ట్ చేయడానికే టైం సరిపోవడం లేదు. ఇంక హీరోయిన్స్‌ను ఫ్లర్ట్ చేసే టైమ్ ఎక్కడిది. అయినా మా బాబాయ్‌కు ఇలాంటివి నచ్చవు. ఏం చేసినా ఊరుకుంటాడు కానీ పరువు పోయే పనులు చేస్తే మాత్రం సహించడు’’ అని చెప్పాడు. కాలేజీ రోజుల్లో ఇవన్నీ కామన్ కానీ ఇప్పుడు అన్నింటికి దూరంగా ఉన్నానన్నాడు నాగవంశీ. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనేది మీకో ఐడియా వచ్చే ఉంటుంది కదా. కానీ అందులో నిజం లేదట అదీ మ్యాటర్.






