‘ఏజెంట్’ ఫెయిల్యూర్‌.. ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన నిర్మాత

by Disha Web Desk 7 |
‘ఏజెంట్’ ఫెయిల్యూర్‌.. ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన నిర్మాత
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఏజెంట్’. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అఖిల్ ఎంతగానో కష్టపడినప్పటికీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమా ఫెయిల్యూర్‌పై ప్రొడ్యూసర్ అనిల్ సుంకర సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశాడు.

‘ఇది కష్టతరమైన పని అయినప్పటికీ జయించాలనుకున్నాం. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయడంతో పాటుగా కోవిడ్ సమస్యలున్నాయి. మేము ఎలాంటి సాకులు చెప్పకూడదు. నెక్ట్స్ మూవీలో ఈ మిస్టేక్స్ జరగవు. ‘ఏజేంట్’పై, మాపై నమ్మకం ఉంచిన వారందరికీ క్షమాపణలు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌లో ప్లానింగ్‌తో పాటు, డెడికేటెడ్‌గా వర్క్ చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story