Priyanka Gandhi: బాలీవుడ్ నటితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రియాంక గాంధీ పీఏ

by Phanindra |   (  Updated:2023-03-08 05:56:53  IST  )

హిందీ ‘బిగ్ బాస్ సీజన్ 16’ కంటెస్టెంట్ టాప్ 5 ఫైనలిస్ట్ అర్చనా గౌతమ్ గురించి పరిచయం అక్కర్లేదు.

Priyanka Gandhi: బాలీవుడ్ నటితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రియాంక గాంధీ పీఏ
X

దిశ, సినిమా: హిందీ ‘బిగ్ బాస్ సీజన్ 16’ కంటెస్టెంట్ టాప్ 5 ఫైనలిస్ట్ అర్చనా గౌతమ్ గురించి పరిచయం అక్కర్లేదు. నటిగా ఉంటూనే 2021లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓటమిపాలైంది. అయితే తాజాగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పీఏ సందీప్ సింగ్‌పై అర్చన తండ్రి కేసు పెట్టాడు. ‘ఛతీస్‌గడ్‌లో జరిగిన ప్లీనరీలో పాల్గొన్నప్పుడు సందీప్ తన కూతురిని కులం పేరుతో దూషించడమే కాకుండా, లాకప్‌లో పెట్టిస్తానని, చంపేస్తానని బెదిరించినట్టుగా అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో మీరట్ పోలీసులు సందీప్ సింగ్‌‌పై పార్థాపూర్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్లు 504, 506, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అర్చనా గౌతమ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మీరట్ ఎస్పీ పీయూష్ సింగ్ తెలిపారు.

Next Story