RRR విషయంలో పప్పులో కాలేసిన ప్రియాంక చోప్రా... దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న ఫ్యాన్స్!

by Disha Web Desk 9 |
RRR విషయంలో పప్పులో కాలేసిన ప్రియాంక చోప్రా... దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న ఫ్యాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్, రాజమౌలి దర్మకత్వంలో తెరకెక్కిన ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకి ఇటీవలే ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా... విదేశాల్లో ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని, అక్కడ తెరకెక్కిన హిందీ సినిమాలు మాత్రమే వారికి తెలుసు. వాళ్లకు మన ఇండస్ట్రీ గురించి తెలిసింది అది మాత్రమే. బాలీవుడ్‌కి ధీటుగా సౌత్ఇండియాలో, స్థానిక భాషల్లో సినిమాలు తెరకెక్కుతాయని వాళ్లకి తెలియదు.

ఈ చిత్రంతో రాజమౌళి ఈ తేడా చెప్పే ప్రయత్నం చేశాడు. హిందీ పరిశ్రమను కించపరచకుండానే ఆర్ఆర్ఆర్ ఒక తెలుగు చిత్రమని అంతర్జాతీయ వేదికపై నొక్కి చెప్పారు. ఈ సినిమా ఆస్కార్ గెలిచినప్పటికీ విదేశీయలు అదో తెలుగు చిత్రమని గుర్తించడం అంత సులభం కాదు. దానికి కొంత సమయం పడుతుంది. ఏ భాష అనేది పక్కన పెడితే, విదేశీయులకు ఆర్ఆర్ఆర్ అంటే బాలీవుడ్ మూవీ అని తెలుసు. ఈ చిత్రం ఇంకా తెలుగులో పూర్తి స్థాయిలో ప్రపంచ గుర్తింపు తెచ్చుకోలేదు. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా పప్పులో కాలేయడం విచారకరం.

అమెరికాలో తాజాగా.. ప్రియాంక చోప్రా ‘ఆర్మ్ ఛైర్ ఎక్స్పర్ట్ విత్ డాక్స్ షెపర్డ్’ అనే పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హోస్ట్ డాక్స్ షెపర్డ్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రస్తావన తీసుకొచ్చి, RRR బాలీవుడ్ మూవీ అన్నారు. తొందరపడి మాట జారిన ప్రియాంక ఆ తప్పును సరి చేసుకుంటూ ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ మూవీ కాదు అదో తమిళ్ మూవీ అన్నారు. ఇది టాలీవుడ్ ఆడియన్స్‌ని హర్ట్ చేసింది. బాలీవుడ్ చిత్రమిని చెప్పడము తప్పు కాదు. కనీ తమిళ చిత్రమని చెప్పి ఆమె మరింతగా బాధపెట్టారని తెలుగు ఆడియన్స్ ఫీల్ అవుతూ ఆమెపై కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రియాంక చోప్రాను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.తమిళ తంబీలు సైతం ఈ విషయంలో ప్రియాంక చోప్రా మీద కామెడీ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో దాదాపు 20 ఏళ్ల పాటు సినిమాల్లో నటించిన ప్రియాంకు తెలుగు-తమిళ చిత్రాల మధ్య తేడా తెలియకపోవడం దారుణం అంటూ..కామెంట్లు పెడుతున్నారు. ఆస్కార్ ఈవెంట్‌కి వెళ్లి, రామ్ చరణ్ దంపతులను కూడా ఆమె కలిశారు. మరి అప్పుడైనా ఆర్‌ఆర్‌ఆర్ ఒక తెలుగు సినిమా అని అవగాహన రాలేదంటే శోచనీయం అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed