- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sam తో Priyanka Chopra రొమాన్స్.. వైరల్‌గా మారిన ఫొటోస్
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అప్ కమింగ్ మూవీ 'లవ్ ఎగైన్' నుంచి రొమాంటిక్ పిక్ షేర్ చేశారు మేకర్స్.

దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అప్ కమింగ్ మూవీ 'లవ్ ఎగైన్' నుంచి రొమాంటిక్ పిక్ షేర్ చేశారు మేకర్స్. హాలీవుడ్ స్టార్ హీరో సామ్ హ్యూగన్, ప్రియాంక, సెలిన్ డియోన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ మూవీని జేమ్స్ స్ట్రౌస్ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా విడుదల తేది అనేకసార్లు వాయిదాపడుతూ వస్తుండగా తాజాగా మరో డేట్ ఫిక్స్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు సోనీ పిక్చర్స్ ఇండియా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో నటీనటుల ఫొటోను అభిమానులతో పంచుకుంటూ..
'ఈ రొమాంటిక్ కామెడీలో మీరా (ప్రియాంక) చనిపోయిన తన భర్త సెల్ ఫోన్ నుంచి కాబోయే భర్తకు మెసేజ్‌లు పంపుతుంది. తానెప్పుడూ ఊహించని మాటలకు ఆకర్షితుడైన జర్నలిస్ట్ సామ్.. ఎలా తన మాయలో పడ్డాడో తెలుసుకోవాలంటే మే 12 థియేటర్‌లో కలుద్దాం' అంటూ రాసుకొచ్చింది. ఇక సామ్‌తో కలిసి వంటగదిలో కుకింగ్ చేస్తున్న పీసీ తాను వండిన పదార్థాన్ని హీరోకు తినిపిస్తూ టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటూ నవ్వుతున్నట్లు పోజులివ్వగా ఇరువురి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి : OSCAR List 2023: టాప్ 10లో నిలిచిన NTR!






