- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగులో మరో బంపర్ ఆఫర్ అందుకున్న ప్రియాంక చోప్రా.. ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా కన్ఫర్మ్!
ప్రియాంక చోప్రా(Priyanka Chopra) రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో ఉంటుందన్న వార్త బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సంచలనం రేపుతోంది.

దిశ, సినిమా: ప్రియాంక చోప్రా(Priyanka Chopra) రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో ఉంటుందన్న వార్త బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సంచలనం రేపుతోంది. అందులో ఒకటి.. రాజమౌళి (Rajamouli)లాంటి విజనరీ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకోవడం ఆమె కెరీర్‌కు మైలురాయిగా మారునుంది. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా చరిత్రనే మళ్లీ రాసేలా తెరకెక్కనుందన్న బజ్ ఉంది. ఇందులో ప్రియాంక పాత్ర కూడా స్ట్రాంగ్‌గా, కథలో కీలక మలుపులను ఇవ్వగలిగే విధంగా ఉండబోతుందట. ఈ కారణంతోనే ఆమె కూడా అందుబాటులో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్‌ను పక్కన పెట్టి ‘వారణాసి’ షూట్‌కు ప్రాధాన్యత ఇస్తోందని ఇండస్ట్రీ టాక్. దీంతో పాటు తెలుగులో ప్రియాంక చోప్రా మరో బంపర్ అందుకుందట. అదే రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ‘కల్కి-2’. ఇక ఈ మొదటి భాగంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించగా.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
కానీ సీక్వెల్‌లో ఆమెను తొలగించిన నిర్మాతలు ప్రియాంకను సంప్రదించినట్లు తెలుస్తోంది. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం. అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వడం ఖాయమని టాక్. అదీ గాక ఈ సీక్వెల్‌లో కమల్ హాసన్ విలన్‌గా కనిపించబోతుండటంతో, ప్రాజెక్ట్‌పై నెలకొన్న హైప్ రెట్టింపు అయింది. ఆయన – ప్రభాస్ స్క్రీన్‌పైని క్లాష్, అలాగే ప్రియాంక ప్రవేశం.. మొత్తం మీదే ఈ సినిమా పాన్ ఇండియా మాత్రమే కాదు, గ్లోబల్ మార్కెట్‌కూ వెళ్తుందన్న సంకేతాలు ఇస్తున్నాయి. నాగ్ అశ్విన్ ప్రత్యేకమైన కథలంటే ఇష్టపడే దర్శకుడు కాబట్టి, ‘కల్కి-2’ను మరింత భారీ కాన్వాస్‌పై విజువల్ వండర్‌గా నిలబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం.






