భారతీయులకు మరొకరి విజయం మింగుడుపడదు : Priyanka Chopra

by Mallepaka Hamsa |

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన కెరీర్ ప్రమాదంలో పడిన సందర్భాలను గుర్తు‌చేసుకుంది. మిస్ వరల్డ్ టైటిల్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లోనూ ప్రేక్షకుల హృదయాలు కొల్లగొడుతున్న తాను.. వృత్తిపరంగా అనేక సమస్యలు, కష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపింది.. Latest Telugu News

భారతీయులకు మరొకరి విజయం మింగుడుపడదు : Priyanka Chopra
X

దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన కెరీర్ ప్రమాదంలో పడిన సందర్భాలను గుర్తు‌చేసుకుంది. మిస్ వరల్డ్ టైటిల్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లోనూ ప్రేక్షకుల హృదయాలు కొల్లగొడుతున్న తాను.. వృత్తిపరంగా అనేక సమస్యలు, కష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపింది. అలాగే భారతదేశంలో కొంతమంది ప్రజలే వేరొకరి విజయాన్ని సంతోషంగా ఆనందిస్తారని అభిప్రాయపడింది. కొందరు తన టాలెంట్, కెరీర్‌ను కిల్ చేయడంతో పాటు ఇండస్ట్రీలో పని దొరక్కుండా చేసి సాగనంపాలని విశ్వప్రయత్నాలు చేసినట్లు చెప్పింది. అంతేకాదు తనకు ప్రతిరోజు చెడు జరగాలని వారు కోరుకున్నట్లు గమనించానన్న బ్యూటీ.. ఎదురైన ప్రాబ్లెమ్స్ అన్నింటినీ అధిగమిస్తూ బాగా నటించడం వల్లే రాణిస్తున్నానని, తనను ఏదీ ఆపలేదని స్పష్టం చేసింది. చివరగా 'ఒక రాత్రి ఏడుస్తాను. కానీ నిరంతరం ఏడుస్తూ కూర్చోను. నిరంతరం మనల్ని విశ్వసించే వ్యక్తులపై, వెలుగుపై దృష్టి కేంద్రీకరించండి. ఆత్మవిశ్వాసంతో విజయాలను అందుకోండి' అని సూచించింది.

Next Story