- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లిని తలచుకుంటూ ప్రియాంక ఎమోషనల్.. పోస్ట్ వైరల్

దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన తల్లి మధు చోప్రా బర్త్ డే సందర్భంగా హార్ట్ ఫెల్ట్ నోట్ షేర్ చేసింది. ఈ ఏడాదితో అమ్మకు 70ఏళ్ల వయసొచ్చినట్లు తెలిపిన నటి.. ఇలాంటి మాతృమూర్తిని కలిగి ఉన్నందుకు తాను చాలా అదృష్టవంతురాలినని చెప్పింది. ‘నా ప్రియమైన అమ్మ.. మీరు అనంతమైన జ్ఞానం ఉన్నవారు. పిల్లలపై మీకున్న ప్రేమ అవధులు లేనిది. మమ్మల్ని ఇంకా కంటికి రెప్పాలా కాపాడుతూనే ఉన్నారు.
ప్రతిరోజు ఒక సింహం మాదిరిగా ఎంతో శక్తివంతగా కనిపిస్తారు. కవిలా సున్నితంగానూ ఉంటారు. మాలో నిరంతరం శక్తిని నింపే గొప్ప మాతృమూర్తి.. నీ నాయకత్వం, ప్రేమను పొందడం మన కుటుంబం అదృష్టమే. 'ఐ లవ్ యూ.. యువర్ ఫర్ ఎవర్ చాంపియన్ అండ్ ఫ్యాన్' అంటూ తల్లిపై ప్రేమను, ఆమె గొప్పతనాన్ని వివరించింది. చివరగా కలలను నిజం చేసుకోవడానికి మనల్ని ఎక్కువగా ప్రేమించే వారికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉండాలని సూచించింది.






