పొద్దున్నే ముంబైలో సందడి చేసిన ప్రియాంక.. ఫొటోలకోసం ఎగబడిన జనం

by Disha Web Desk 23 |
పొద్దున్నే ముంబైలో సందడి చేసిన ప్రియాంక.. ఫొటోలకోసం ఎగబడిన జనం
X

దిశ, సినిమా: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పొద్దు పొద్దున్నే ముంబైలో తెగ సందడి చేసింది. ఈ మేరకు Jio MAMI Film Festival 2023 ఓపెనింగ్‌ నైట్‌ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ముంబైకి వచ్చిన నటి.. ఎయిర్ పోర్ట్‌లో దిగగానే విలేఖర్లు చుట్టుముట్టి ఆమె అందాలను కెమెరాల్లో బంధించారు. బ్లాక్‌ క్రాప్‌ టాప్‌ మ్యాచింగ్‌ ప్యాంట్‌లో దర్శనమిచ్చిన ప్రియాంక తనపైకి దూసుకొస్తున్న ఫొటో గ్రాఫర్లను కంట్రోల్ చేసేందుకు కాస్త ఇబ్బంది పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ముంబైలోని బాంద్రా కుర్ల కాంప్లెక్స్‌ జియో వరల్డ్‌ సెంటర్‌లో ఈ ఫెస్టివల్‌ జరుగనుండగా కార్యక్రమం ముగియగానే మళ్లీ ఆమె లాస్ ఎంజెల్స్ వెళ్లనున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed