BI**CH.. BICHARI.. సీనియర్ హీరోయిన్‌ ఫొటోతో సహా.. దుమారం రేపుతున్న ప్రియాంక పోస్ట్...

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-03 07:40:38  IST  )

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. ఇంటర్వ్యూస్‌లో ఓపెన్‌గానే తను చెప్పాలనుకున్నది చెప్పేస్తది. ఎక్స్‌ల గురించి అడిగినా తడుముకోకుండా సమాధానమిచ్చిన ఈ హీరోయిన్.. క్రిప్టిక్ పోస్ట్‌లను పెట్టడంలోనూ ముందుంటుంది.

BI**CH.. BICHARI.. సీనియర్ హీరోయిన్‌ ఫొటోతో సహా.. దుమారం రేపుతున్న ప్రియాంక పోస్ట్...
X

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ముక్కు సూటిగా మాట్లాడుతుంది. ఇంటర్వ్యూస్‌లో ఓపెన్‌గానే తను చెప్పాలనుకున్నది చెప్పేస్తది. ఎక్స్‌ల గురించి అడిగినా తడుముకోకుండా సమాధానమిచ్చిన ఈ హీరోయిన్.. క్రిప్టిక్ పోస్ట్‌లను పెట్టడంలోనూ ముందుంటుంది. బోల్డ్ మీమ్స్, కోట్స్ చేసే ఆమె.. తాజాగా సీనియర్ హీరోయిన్ రేఖ ఫొటోతో ఓ కోట్ షేర్ చేయడం నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలు ఆమె ఉద్దేశం ఏంటి? ఎందుకు రేఖ ఫొటోను యూజ్ చేయాల్సి వచ్చింది? అని డిస్కస్ చేస్తున్నారు జనాలు.

‘BETTER BE A BI*TCH THAN A BICHARI’ అంటూ స్టోరీ షేర్ చేసింది బ్యూటీ. హెల్ప్‌లెస్‌గా ఉండటం కన్నా బోల్డ్‌గా ఉండటం మంచిదని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ ఈ కోట్‌కు రేఖ ఇమేజ్ యూజ్ చేయడంతోనే అసలు చిక్కు వచ్చిపడింది. ఇక ఈ పోస్ట్‌పై కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు.. ‘బిచ్‌గా ఉండటం వల్లే హాలీవుడ్‌లో ఉండగలిగింది. బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌తో రిలేషన్స్ పెట్టుకుంది. అబద్ధాలు చెప్తూ ఇమేజ్ పెంచుకుంది’ అంటూ ప్రియాంకను విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story