ప్రియాంక అరుల్ మోహన్ పిక్స్ వైరల్.. చీర ధర ఎంతో తెలుసా..?

by Dishafeatures1 |
ప్రియాంక అరుల్ మోహన్ పిక్స్ వైరల్.. చీర ధర ఎంతో తెలుసా..?
X

దిశ, సినిమా: అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. నాని ‘గ్యాంగ్ లీడ‌ర్‌’, శ‌ర్వానంద్ ‘శ్రీకారం’ వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తన అందం నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కోలివుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది సూర్య వంటి స్టార్ హీరోలతో కూడా జత కట్టింది.

మూవీస్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రియాంక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా కొన్ని ఫోటోలను పంచుకుంది. బూడిద రంగు చీరలో మరింత అందంగా కనిపించింది. ఇక ఈ ఫోటోలు చూసిన చాలా మంది ఆ చీర అద్భుతంగా ఉందంటూ, ఆ చీర గురించి సోషల్ మీడియాలో వెతకడం మొదలు పెట్టారు. దీంతో ఆ చీర ఖరీదు అక్షరాల 5,29,900 రూపాయలు అని తెలిసింది. ఒక్క చీర ఖరీదు ఐదు లక్షలా అంటూ నోరెళ్లబెడుతున్నారు నెటిజన్స్. ప్రజంట్ ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed