వారికంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నా.. హాట్ టాపిక్‌గా మారిన ప్రియమణి కామెంట్స్

by Mallepaka Hamsa |

హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రేక్షకులను మైమరపించిన వారిలో ప్రియమణి( Priyamani)ఒకరు.

వారికంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నా.. హాట్ టాపిక్‌గా మారిన ప్రియమణి కామెంట్స్
X

దిశ, సినిమా: హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ ప్రేక్షకులను మైమరపించిన వారిలో ప్రియమణి( Priyamani)ఒకరు. ఒకప్పటి హీరోయిన్ అయినప్పటికీ ఇప్పటికీ తన నటనతో ఇండస్ట్రీలో సత్తా చూపిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ చిత్రాలతో పాటు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. త్వరలో ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ (The Family Man-3)వెబ్ సిరీస్‌తో రాబోతుంది. ఈనేపథ్యంలో.. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ప్రియమణి ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. పారితోషికం, షూటింగ్ టైమింగ్స్‌ ఇష్యూపై స్పందించింది. ‘‘నేనెప్పుడూ రెమ్యునరేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదు. నాకున్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలను అందుకు తగినట్లుగా పారితోషికం ఇవ్వమని అడిగేదాన్ని.

చాలా సందర్భాల్లో నా తోటి నటించిన వారికంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాను. నా పాత్ర, నిడివి చూసుకొని సినిమాలను అంగీకరిస్తాను. కానీ డబ్బులు ఎంత ఇస్తున్నారనేది నేను పట్టించుకోను. ఆ పాత్రకు నేను అర్హురాలిని అని భావిస్తే మాత్రమే పారితోషికం పెంచమని డిమాండ్ చేసేదాన్ని అంతేకానీ అనవసరంగా ప్రతిసారి పారితోషికం పెంచమని కోరలేదు. ఇన్నాళ్లుగా నేను ఇండస్ట్రీలోని హీరోలకంటే నేను తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నా’’ అని చెప్పింది. అంటే అనవసరంగా కొంతమంది సెలబ్రిటీలు పారితోషికం పెంచమని అడుగుతున్నారని చెప్పకనే చెప్పింది. దీంతో ప్రియమణి ఎవరిని ఉద్దేశించి అంటుందా? అని అంతా ఆలోచనలో పడ్డారు.

Next Story