- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రాబోతున్న ప్రియదర్శి రొమాంటిక్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
విభిన్న కథలు ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తూ తన పాపులారిటీ పెంచుకుంటున్నాడు ప్రియదర్శి(Priyadarshi).

దిశ, సినిమా: విభిన్న కథలు ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తూ తన పాపులారిటీ పెంచుకుంటున్నాడు ప్రియదర్శి(Priyadarshi). ఒకప్పుడు పలు చిత్రాల్లో కమెడీయన్‌గా నటించిన మెప్పించిన ఆయన హీరోగా బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్నాడు. ప్రియదర్శి, ఆనంది (Anandi)కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ప్రేమంటే’(premante). నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రానా స్పిరిట్ మీడియా సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించారు. ఈ రొమాంటిక్, కామెడీ మూవీలో సుమ కనకాల, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించారు. మధుసూధన్ అనే కుర్రాడు.. రమ్మ (ఆనంది)అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని విషయాలు తెలిసినా సరే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతాడు.
కానీ వీరిద్దరి మధ్య నిత్యం గొడవలే తలెత్తుతాయి. అయినప్పటికీ రాత్రి వరకు అన్ని సర్ధుకుంటాయి. ఇక మధుసూదన్, రమ్మ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేది స్టోరీ. ఈ సినిమా నవంబర్ 21న థియేటర్స్‌లోకి వచ్చి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా, ‘ప్రేమంటే’డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. నెల రోజుల్లోనే స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ అందమైన వైభవాలు వేడుకే ‘ప్రేమంటే’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఖుషీ అవుతున్నారు.






