- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాలు చేయొద్దన్న నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రియదర్శి..
కమెడీయన్‌గా పరిచయం అయి ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు ప్రియదర్శి(Priyadarshi).

దిశ, సినిమా: కమెడీయన్‌గా పరిచయం అయి ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు ప్రియదర్శి(Priyadarshi). ‘మల్లేశం’ సినిమాతోహీరోగా మారాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా, కామెడీయన్‌గా వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా మారాడు. త్వరలో ప్రేక్షకులను ‘ప్రేమంటే’(premante) చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో ప్రియదర్శి సరసన ఆనంది(Anandi) హీరోయిన్‌గా నటించనుండగా.. సుమ, వెన్నెల కీషోర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌ను మూవీ మేకర్స్ విడుదల చేస్తూ జోష్ పెంచుతున్నారు.
ఇక ఈ చిత్రం నవంబర్ 21న గ్రాండ్‌గా విడుదలైంది. తాజాగా, ప్రియదర్శి అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించగా.. ఇందులో నెటిజన్లు పలు ప్రశ్నలు అడగ్గా.. దానికి ఆయన సమాధానాలు చెప్పారు. అయితే ఓ నెటిజన్ మాత్రం అన్నా నువ్వు సినిమాలు చేయడం ఆపేయ్ ప్లీజ్ అని పోస్ట్ పెట్టాడు. ఇక దీనికి ప్రియదర్శి తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు. ‘‘మరి ఏం చేయమంటావ్? గడ్డి పీకమంటావా?’’ అని ప్రశ్నించాడు. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రియదర్శి అంత మాట అనేశాడేంటని అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.






