- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కిన్ కలర్, బాడీ కొలతలుంటే సరిపోదు.. అది కూడా ఉండాలి
యంగ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ అందానికీ నిర్వచనం లేదంటోంది.

X
దిశ, సినిమా : యంగ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ అందానికీ నిర్వచనం లేదంటోంది. ఇటీవల వరుస చిత్రాలతో బిజీగా ఉంటున్న ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్కిన్ కలర్ కారణంగా తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తుచేసుకుంది. ‘చర్మ సౌందర్యం కోసం సినీ తారలు చాలా ఖర్చు చేస్తారు. అయితే సాధారణ అమ్మాయిలకు అలా చేయడం సాధ్యం కాదు. కాబట్టి రంగు, రూపం, బాడీ కొలతలు.. ఇతరేతర వాటిగురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కెమెరా కంటితో తీసిన ఫొటోలను చూసి వ్యక్తిపై అంచనాకు రాకూడదు. మీరు ఎవరు? ఏం కావాలనుకుంటున్నారు? అనే విషయాలు ఇతరులు డిసైడ్ చేయకూడదు. ఎవరికారణంగా మానసిక వేదనకు గురికాకుండా జీవితాన్ని పరిపూర్ణంగా గడపాలి. అయితే మనం కోరుకున్నది సాధించేవరకూ ఈ ప్రపంచంతో పోరాడి గెలవాల్సి ఉంటుందని మరిచిపోవద్దు’ అంటూ తన అభిమానులకు పలు సూచనలు చేసింది.
Read more:
Next Story






