- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ప్రేమలు’ మ్యాజిక్ రిపీట్.. అఫిషీయల్ ప్రకటనతో షాకిచ్చిన మమిత బైజు
మమిత, సంగీత్ ప్రతాప్ మళ్ళీ కలిసి నటించబోతున్నారు.

దిశ, సినిమా: మలయాళ సెన్సేషన్ మమిత బైజు, సంగీత్ ప్రతాప్ కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ‘ప్రేమలు’. 2024లో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ మూవీతో వీరిద్దరూ యూత్ ఐకాన్స్‌గా మారిపోయారు. తాజాగా ఈ జోడీకి సంబంధించి ఒక అఫీషియల్ అప్‌డేట్ రావడంతో నెట్టింట చర్చ మొదలైంది. మమిత, సంగీత్ ప్రతాప్ మళ్ళీ కలిసి నటించబోతున్నారు. ‘ప్రేమలు’ తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి చాలామంది వీరు ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు సృష్టించారు. సంగీత్‌కు అప్పటికే వివాహం కావడంతో ఆ వార్తలకు బ్రేక్ పడింది. కానీ ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి ఒక క్యూట్ లవ్ స్టోరీలో నటించబోతుండటంతో ఆ పుకార్లు మళ్ళీ ఊపందుకున్నాయి. ఈ సినిమాకు దినోయ్ పౌలోస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆషిన్ ఉస్తాన్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ప్రస్తుతానికి ‘ప్రొడక్షన్ 20’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా పట్టాలెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు మమిత బైజు తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. దీంతో మరోసారి సంగీత్, మమిత ప్రేమ వార్తలు జోరందుకుంటున్నాయి. వీరి ప్రేమ నిజమే అని కొందరు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ‘ప్రేమలు’ సినిమాలో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటనతో అటు మమిత ఫ్యాన్స్, ఇటు మలయాళ చిత్ర ప్రేమికులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మమిత గ్లామర్, సంగీత్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్లస్ కానున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.






