Prakash Raj అర్బన్ నక్సలైట్:Vivek Agnihothri (వీడియో)

by Disha Web Desk 4 |
Prakash Raj అర్బన్ నక్సలైట్:Vivek Agnihothri (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాష్ రాజ్‌పై కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. ప్రకాష్ రాజ్ కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడుతూ.. అదో నాన్సెన్స్ ఫిల్మ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా వివేక్ అగ్నిహోత్రి ప్రకాష్ రాజ్‌కు కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ అర్బన్ నక్సలైట్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం మెచ్చిన చిన్న చిత్రం కొంతమంది అర్బన్ నక్సలైట్స్ కు నిద్ర పట్టనివ్వడం లేదన్నారు. ఆ సినిమా విడుదలై ఏడాది కావస్తున్నా కొంత మందిని ఇబ్బంది పెడుతూనే ఉందని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

మొరిగే కుక్కల గురించి పట్టించుకోనక్కర్లేదన్నారు. ఇక నాకు ఆస్కార్ కాదు భాస్కర్ అవార్డ్ కూడా రాదని ఆయన అన్నారు. ఆ అవార్డ్ మీది అయినప్పుడు నాకేలా వస్తుంది అంధరాజ్ గారూ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి : 'బిచ్చగాడు 2' మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..

Next Story

Most Viewed