కన్నప్ప కోసం న్యూజిలాండ్‌లో ల్యాండ్ అయిన ప్రభుదేవా..

by Dishafeatures1 |
కన్నప్ప కోసం న్యూజిలాండ్‌లో ల్యాండ్ అయిన ప్రభుదేవా..
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ . దర్శకుడు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ శ్రీ కాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో భక్తిరస ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తుండగా పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా కోసం న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో షూటింగ్ చేస్తున్నారు.

ఇక తాజా సమాచారం ప్రకారకం ‘కన్నప్ప’ మూవీకి ఇండియన్ టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా రంగంలోకి దిగాడు. ఈ సినిమాలోని పాటలకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఈ మేరకు న్యూజిలాండ్‌లో ప్రభుదేవాకు మూవీ టీమ్ స్వాగతం పలికింది. ప్రభుదేవా రాకతో ఈ సినిమా మరో లెవెల్‌కు వెళ్లింది.

Read More..

దిల్‌రాజు ఆ రోజు నన్ను దారుణంగా తిట్టాడు : సుకుమార్



Next Story

Most Viewed